మాస్కుల పేరుతో డ్రగ్స్ దందా ... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 04, 2020

మాస్కుల పేరుతో డ్రగ్స్ దందా ...

ఎన్ 95 మాస్కుల పేరుతో డ్రగ్స్ దందాకు తెరతీశారు హైదరాబాద్ లోని డ్రగ్స్ మాఫియా. బెంగళూరు నుండి ఫేస్ మాస్క్ ల బిజినెస్ పేరుతో డ్రగ్స్ అక్రమ రవాణాకు తెరతీశారు కొందరు పాత నేరస్తులు. గతంలో డ్రగ్స్ దందా చేసి కేసులు కూడా నమోదు అయిన పాత నేరగాళ్ళు ఇప్పుడు మరోమారు బెంగళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు.
హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు తాజాగా ఇద్దరూ డ్రగ్స్ మాఫియా సభ్యులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 54 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో హైదరాబాద్ లో డ్రగ్స్ దందా నిర్వహించిన నైజీరియన్ మైక్ నుండి వారు 70 గ్రాముల కొకైన్ కొనుగోలు చేసినట్లుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన పరంజ్యోతి సింగ్,అమిత్ కుమార్ లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా, కరోనాను అడ్డు పెట్టుకొని డ్రగ్స్ దందా సాగించారు.