పాడి పరిశ్రమ, చేపల పెంపకంతో లక్షల కుటుంబాలకు ఉపాధి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 10, 2020

పాడి పరిశ్రమ, చేపల పెంపకంతో లక్షల కుటుంబాలకు ఉపాధి

పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖలు, పరిశ్రమలశాఖ సమన్వయంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన సాగునీటి వనరులతో వ్యవసాయంతోపాటు.. పాడిపరిశ్రమ, మత్స్యరంగం అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరువతో పశుసంవర్ధకశాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందని.. వాటిద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థలో అనేక సానుకూల మార్పులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఉచితంగా విడుదలచేస్తున్న చేపపిల్లలతో మత్స్య సంపద ఎంతో వృద్ధిచెందిందని, పాడి పశువుల పంపిణీతో పాలఉత్పత్తి, గొర్రెల పంపిణీతో మాంసం ఉత్పత్తి భారీగా పెరుగుతున్నదని చె ప్పారు. పశుసంవర్ధకశాఖ, పరిశ్రమలశాఖ సమన్వయంతో ప్రాసెసింగ్‌యూనిట్ల ఏర్పాటుకు ప్ర ణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. పశుసంవర్ధకశాఖ తరపున చేపట్టే ఏ కార్యక్రమానికైనా సహకరిస్తామన్న  కేటీఆర్‌.. ఇలాంటివాటిని తన సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని సూచించారు. గొర్రెలు, పశువులు, చేపపిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలతో గ్రామీణప్రాంతాల్లో లక్షల కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధి లభిస్తున్నదని చెప్పారు. 

Post Top Ad