తెలంగాణ ధనిక రాష్ట్రమే.. అందులో డౌటే లేదు : కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 25, 2020

తెలంగాణ ధనిక రాష్ట్రమే.. అందులో డౌటే లేదు : కేసీఆర్

తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమే అని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. అభివృద్ధి పనులకు డబ్బుల కొరతే లేదని అన్నారు. గురువారం నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వల్ల విధించాల్సి వచ్చిన లాక్‌డౌన్‌ సమయంలోనూ రైతులకు రైతుబంధు డబ్బులు వేయడం ఆపలేదని గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపి మరీ గ్రామాలకు డబ్బులు అందించామని వివరించారు. ఈ సందర్భంగా నర్సాపూర్‌లో రూ.15 కోట్లతో నిర్మించిన అర్బన్‌ పార్కును సీఎం ప్రారంభించారు.
పచ్చదన పరిరక్షణ ప్రజలందరి బాధ్యత అని కేసీఆర్ అన్నారు. ప్రజాప్రతినిధులు పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలని నిర్దేశించారు. లాక్‌డౌన్‌‌ను ఎత్తివేయడం వల్ల క్రమంగా రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడిందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రమే అని అందులో డౌటే లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం అధికారికంగా చెబుతున్నానని అన్నారు.

ఇక సంగారెడ్డికి ఈ ఏడాదిలోనే కాళేళ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తాయని కేసీఆర్ తెలిపారు. మరోవైపు, చెట్లు నరికే వారిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలపను అక్రమంగా తరలించాలని చూస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఇకపై కలప స్మగ్లర్లను దేశంలో ఎవరూ కాపాడలేరని, వారు తప్పించుకొనేందుకు అవకాశమే లేదని వివరించారు. ఆ విషయంలో తమకు వెంటనే సమాచారం వస్తుందని తెలిపారు.