మంత్రి హరీశ్ రావు పీఏకు కరోనా పాజిటివ్? - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 12, 2020

మంత్రి హరీశ్ రావు పీఏకు కరోనా పాజిటివ్?

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి జనాలను భయపెడుతోంది. ఉన్నతాధికారుల, రాజకీయ నాయకులు కూడా కోవిడ్ దెబ్బకు వణికిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇటీవలే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ దగ్గర డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి కోవిడ్ బారిన పడగా.. మేయర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు, ఇతర అధికారులు హోం క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా మంత్రి   హరీశ్ రావు పీఏ కూడా కరోనా బారిన పడ్డారని ప్రచారం జరుగుతోంది.
హరీశ్ రావు పీఏకు కరోనా సోకిన విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఒక వేళ ఇది నిజమేనని తేలితే మాత్రం మంత్రి కూడా హోం క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి మంత్రి హరీశ్ రావు ప్రజలను కోవిడ్ విషయమై చైతన్య వంతుల్ని చేస్తున్నారు. అందరికీ అర్థమయ్యే జాగ్రత్త చర్యలను వివరిస్తున్నారు. నిరంతరం జనంలో తిరుగుతూ వారికి అండగా నిలుస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో ఇద్దరు కలెక్టర్లు హోం క్వారంటైన్లోకి వెళ్లారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌తోపాటు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కూడా ఇంటికి పరిమితమయ్యారు. యాదాద్రి జిల్లా సీఈవోకు కరోనా సోకడంతో ఇంట్లో నుంచే పని చేయాలని కలెక్టర్ నిర్ణయించారు.