కరోనాతో హోంగార్డ్ మృతి.. కార్పో‘రేట్’ చెల్లించలేక.. గాంధీకి తీసుకెళ్తుండగా.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 16, 2020

కరోనాతో హోంగార్డ్ మృతి.. కార్పో‘రేట్’ చెల్లించలేక.. గాంధీకి తీసుకెళ్తుండగా..

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ హోంగార్డ్ కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. డబీర్‌పురాకు చెందిన అశోక్ హోం గార్డ్‌గా పని చేస్తుండగా.. ఇటీవలే కోవిడ్ బారిన పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతణ్ని మలక్‌పేటలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్సకు డబ్బులు లేకపోవడంతో... కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్‌కు తరలించాలని భావించారు. మరో వైపు అతడి పరిస్థితి విషమించింది.
దీంతో కుటుంబ సభ్యులు అతణ్ని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే అతణ్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని తెలిపారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ఈ ఏడాది మే 21న తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా మరణం నమోదైంది. కానిస్టేబుల్ యాదగిరి రెడ్డి కోవిడ్ బారిన పడి చనిపోయారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పలువురికి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో డాక్టర్లు, పోలీసులకు గాంధీ హాస్పిటల్‌లోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు.