రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కార్పోరేటర్ జానకి రామ రాజు గారు* - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 02, 2020

రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కార్పోరేటర్ జానకి రామ రాజు గారు*

శుభ తెలంగాణ న్యూస్ :హైదరాబాద్ కేటీఆర్ దత్తత డిజన్ హైదర్ నగర్ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హెచ్ఎంటి శాతవాహన కమ్యూనిటీ హాల్ లో  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు, నాయి బ్రాహ్మణులకు, జిహెచ్ఎంసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, మోటార్ మెకానిక్ లకు 400 మందికి 15 రకాలతో కూడిన నిత్యావసర సరుకుల కిట్లను స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... లాక్ డౌన్  సమయంలో ఉపాధి కోల్పోయిన జర్నలిస్టులకు, నాయి బ్రాహ్మణులకు, పారిశుద్ధ్య కార్మికులకు, మెకానిక్ లకు తన సొంత నిధులతో  నిత్యావసర సరుకుల కిట్లను  అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో లాక్ డౌన్  మొదలైనప్పటి నుంచి డివిజన్ లో  వరుస కూలీలకు, పేద ప్రజలకు, కార్మికులకు 3800  నిత్యావసర సరుకులను కిట్లను 
అందజేయడంతో దాదాపు 20 వేల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. నిరంతరం డివిజన్ లో  నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు . ఇంకా ఎవరైనా డివిజన్ లో  ఉపాధి కోల్పోయిన కార్మికులు పేద ప్రజలు  నిత్యావసర సరుకుల కిట్ల కోసం కార్పొరేటర్ కార్యాలయంలో  సంప్రదిస్తే అర్హులైన వారికి నిత్యావసర సరుకులను  అందజేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ భారత్,బోస్ రెడ్డి , చిందం  శ్రీకాంత్,విజయ, గంగ భవాని,  కృష్ణకుమారి, ఏరియా కమిటీ మెంబర్స్ శేషయ్య, రేణుక, సదా మాధవి, పర్వీన్ సుల్తానా ,డివిజన్ గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి,డివిజన్ ఉపాధ్యక్షులు రామ్ మోహన్ రాజు, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దానయ్య , తెరాస నాయకులు మురళీధర్ రావు, రంగనాథ రాజు, ఎస్ వి ఎస్ రాజు,  వెంకటేష్ యాదవ్,రవికుమార్, సుబ్బరాజు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, యాసీన్, రమేష్, నాగేశ్వరరావు, లక్ష్మి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..