కేసీఆర్ కు తెలంగాణా యాపిల్స్ అందించిన రైతు .. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 02, 2020

కేసీఆర్ కు తెలంగాణా యాపిల్స్ అందించిన రైతు ..


తెలంగాణ రైతాంగం ఎటువంటి పంటలనైనా పండించగలరు అని నిరూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యాపిల్ సాగు చేశాడు ఓ రైతు. చల్లని వాతావరణంలోనే సాగయ్యే యాపిల్ పంటను తెలంగాణ రాష్ట్రంలోనూ పండించి చూపించిన ఆ రైతు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణా తొలి పంట అయిన యాపిల్స్ ను సీఎం కేసీఆర్ కు అందించారు.

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా పండిన యాపిల్ పండ్లను సీఎం కేసీఆర్ కు అందించడంతో కెసిఆర్ రైతును అభినందించారు. కొమురం భీం జిల్లాలోని కెరమెరి మండలం ధనోరాకు చెందిన కేంద్రె బాలాజీ గత నాలుగు సంవత్సరాలుగా యాపిల్ సాగుచేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సహాయ సహకారాలతో,చాలా జాగ్రత్తగా యాపిల్ సాగుచేసిన బాలాజీ మొదటి పంట పడడంతో తెలంగాణ యాపిల్స్ బుట్టను సీఎం కేసీఆర్ కు అందించారు. రెండు ఎకరాల్లో హెచ్ఆర్ 99 రకం యాపిల్ పంట సాగు చేసిన బాలాజీని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు.