వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 15, 2020

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే..


కరోనా వైరస్, సీజనల్ వ్యాధులు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ప్రజలకు సూచనలు..

కుత్బుల్లాపూర్ జూన్ 15 (శుభ తెలంగాణ) కరోనా వైరస్ ప్రభావం వల్ల ఒకరిని ఒకరు కలవలేని పరిస్థితి ఏర్పడటంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్ల అధికారులు, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, సంక్షేమ సంఘం సభ్యులు, నాయకులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ రోజు రోజుకీ అతి వేగంగా వ్యాప్తి చెందుతున్నందు వలన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు మన ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రపరచుకోవాలని సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఏర్పడిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతామని అన్నారు.

Post Top Ad