కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రికి కేటీఆర్‌ విజ్ఞప్తి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 06, 2020

కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రికి కేటీఆర్‌ విజ్ఞప్తి

మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు విమానాన్ని నడపాల్సిందిగా కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మస్కట్‌లో ఉన్న తెలంగాణకు చెందిన పలువురు వ్యక్తులు లాక్‌డౌన్‌ కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. మస్కట్‌ నుంచి విమానాలన్ని కేరళ రాష్ర్టానికే నడుపుతున్నట్లు తెలిపారు. కావునా తాము రాష్ర్టానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరగా స్పందించిన కేటీఆర్‌ కేంద్రానికి ఈ మేరకు విజ్ఞప్తిని చేశారు. 
సాటి భారతీయులు, తెలంగాణవాసులు మస్కట్‌లో జీతాలు లేక, తినేందుకు తిండిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావునా వీరిని మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు విమానం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందేభారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్రం భారత్‌కు తిరిగి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.

Post Top Ad