కమిషనరేట్లలో కేసీఆర్ ప్రైవేటు సైన్యం వీరే.. రేవంత్ సంచలన ఆరోపణలు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 26, 2020

కమిషనరేట్లలో కేసీఆర్ ప్రైవేటు సైన్యం వీరే.. రేవంత్ సంచలన ఆరోపణలు

పోలీస్ శాఖలో తన కోసం ప్రత్యేకంగా పని చేసేలా అధికారులను కేసీఆర్ కీలకమైన స్థానాల్లో నియమిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ఫిరాయింపులు, టెలిఫోన్ ట్యాపింగ్ కోసం, తప్పులు ఎత్తిచూపే నేతలపై కేసులు పెట్టడానికి, ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై నిఘా పెట్టడానికి వారిని వినియోగిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ శాఖలోని తన బంధు వర్గం సూచనల మేరకు అర్హులకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఆపుతున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వైఖరి వల్ల పోలీస్ శాఖలో నిజాయతీగల ఇతర సామాజిక వర్గాలకు చెందిన అధికారులు బాధపడుతున్నారని అన్నారు.
కేసీఆర్ వైఖరి వల్లనే వీకే సింగ్ లాంటి అధికారులు పదవి నుంచి తప్పించాలని కోరుతున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రిటైర్ అయిన తన బంధువులకు తిరిగి కీలక బాధ్యతలు అప్పగించి ప్రతిపక్షాలను అణచడానికి వినియోగిస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. ‘‘తన బంధువులైన అధికారులను నియమిచడం ద్వారా కేసీఆర్ హైద్రాబాద్ చుట్టూ భూములను కొల్లగొడుతున్నారు. పోలీస్ శాఖలో కేసీఆర్ సామాజిక వర్గం వెలమ దొరలకే పెద్ద పీట వేస్తున్నారు. ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్న తన బంధువులను అదే హోదాలో కొనసాగించడానికి కేసీఆర్ ఫైల్స్ కదుపుతున్నారు.’’