జీహెచ్‌ఎంసీ మేయర్‌కు కరోనా పరీక్షలు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 12, 2020

జీహెచ్‌ఎంసీ మేయర్‌కు కరోనా పరీక్షలు

జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయన నుంచి వైద్యులు నమూనాలు సేకరించారు. ఇవాళ సాయంత్రానికి వాటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. మేయర్‌ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌కు కరోనా లక్షణాలు కన్పించడంతో జూన్‌ 11న పరీక్షలు నిర్వహించారు. అందులో ఆయనకు పాజిటివ్‌ అని తేలింది. గురువారం ఉదయం వరకు అతడు విధులు నిర్వహించాడు. దీంతో మేయర్‌ కుటుంబం స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులందరికి పరీక్షలు నిర్వహించగా వారికి నెగెటివ్‌ వచ్చింది. 
మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్‌కు బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తాజాగా ఆయన డ్రైవర్‌కు కూడా కరోనా సోకడంతో మేయర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. రెండు వారాల క్రితం నగరంలోని రోడ్డు పక్కనే ఉండే ఓ హోటల్‌లో అధికారులతో కలిసి మేయర్‌ చాయ్‌ తాగారు. ఆ హోటల్‌లో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా వచ్చింది తేలింది. దీంతో వారం క్రితం మేయర్‌ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది.

Post Top Ad