హైదరాబాద్లో కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగుతోందా.. అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రతీరోజూ నమోదవుతున్న కేసుల్లో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతుండటంతో కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగుతోందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఇండియా ఇన్ పిక్సెల్స్ సర్వే తెలంగాణలో 122శాతం కమ్యూనిటీ స్ప్రెడ్కి అవకాశం ఉందని చెప్పడం కూడా దీనికి ఊతమిచ్చినట్టయింది. అయితే ప్రభుత్వం మాత్రం అది తప్పుడు లెక్క అని... రాష్ట్రంలో వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి జరగట్లేదని స్పష్టం చేసింది.ఒకవేళ హైదరాబాద్లో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగకపోతే ప్రతీరోజూ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు ఎందుకు నమోదవుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ నుంచి జనగామ వెళ్లిన ఓ వ్యక్తి ఓ ఫర్టిలైజర్ షాపు యజమానిని కలవగా... అతని ద్వారా 30 మందికి అక్కడ కరోనా సోకినట్టుగా నిర్దారణ అయింది. దీంతో హైదరాబాద్ ద్వారా జిల్లాలకు కరోనా వ్యాప్తి జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు నగరంలోని ఆస్పత్రులన్నీ ఇప్పటికే కరోనా పేషెంట్లతో నిండిపోయాయన్న కథనాలు వస్తున్నాయి. దీంతో సాధారణ పేషెంట్లు లేదా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం సాధారణ లక్షణాలు ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేర్చుకోవద్దని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను ఆదేశించినట్టు చెబుతున్నారు.
Post Top Ad
Wednesday, June 24, 2020
హైదరాబాద్ నుంచి జిల్లాలకు వైరస్ వ్యాప్తి...
Admin Details
Subha Telangana News