వేగంగా పట్టణాభివృద్ధి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 16, 2020

వేగంగా పట్టణాభివృద్ధి


  • హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. ప్రగతిభవన్‌లో సోమవారం ఆయన వికారాబాద్‌, తాండూరు, పరిగి పట్టణాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడు పట్టణాల్లో పార్కులు, ఫుట్‌పాత్‌లు, రోడ్లు, టాయిలెట్ల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పురపాలక కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. ఆదాయవనరులు, ఖర్చు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో అన్ని పురపాలక పట్టణాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, వాటిని వేగంగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేసినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సమీక్షలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌, తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు ఆనంద్‌, రోహిత్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.