వికారాబాద్ జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్,ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి..... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 09, 2020

వికారాబాద్ జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్,ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి.....

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరంగా మారిందని, కొరోన వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా కూడా కళ్యాణలక్ష్మి ఆగదు అని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు అన్నారు. కోటపల్లి మండలం లోని ఎన్నారం గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పెండ్లికాని ఆడపిల్లలను ఆదుకోవాలనే ఉద్ధేశ్యంతో కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టిందన్నారు. ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్‌ పెద్దన్నగా నిలిచి రూ. 1,00,116 అందజేస్తున్నారు అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 10 మంది లబ్దిదారులకు రూ. 10 లక్షల, 01 వేయి, 160 రూపాయలు లబ్ది చేకూరిందని
తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి MPP శ్రీనివాస్ రెడ్డి గారు, Pacs చెర్మెన్ రాంచంద్రారెడ్డి గారు, వైస్ ఎంపీపీ ఉమాదేవి గారు, స్థానిక సర్పంచ్ సావిత్రి దశరథ్ గౌడ్ గారు, వికారాబాద్ PACs ఛైర్మెన్ ముత్యంరెడ్డి గారు, MPDO లక్ష్మీనారాయణ గారు, MRO గారు, TRS పార్టీ మండల అధ్యక్షులు అనిల్ గారు, సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకటేశ్ యాదవ్ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad