రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 10, 2020

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి జిల్లాలోని ముస్తాబాద్‌ మండలం బండనకల్‌ చేరుకుంటారు. అక్కడ మండుటెండల్లో మత్తడి దుంకుతున్న బందనకల్‌ ఊరచెరువులో గోదారి జలాలకు మంత్రి హారతి ఇస్తారు. అనంతరం గ్రామంలో తలపెట్టిన రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు వైకుంఠధామం, రజకసంఘ భవనం, సీసీ కెమెరాలను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం మందికుంట, చీకోడుల్లో రైతు వేదికల నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నారు. చిప్పలపల్లిలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం గంభీరావుపేటకు చేరుకుని మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భఃగా స్థానిక ప్రజాప్రతినిధులకు అభివృద్ధి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.

Post Top Ad