నంగునూరు అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 17, 2020

నంగునూరు అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

జూలై నెలాఖరులోపు ప్రతి గ్రామంలో డంప్ యార్డు, గ్రేవ్ యార్డు నిర్మాణాలు జరగాలి. డంప్ యార్డులలో వర్మీ కంపోస్టు తయారు చేయించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేట నియోజక వర్గ పరిధిలోని నంగునూరు మండల ఏంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ లు, ఏంపీటీసీలు, వివిధ శాఖల అధికారులతో హైదరాబాదులోని తన నివాసం నుంచి మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ ప్రగతి,  అభివృద్ధి పనుల పురోగతి, కల్లాల నిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షించారు. 
డంప్, గ్రేవ్ యార్డు నిర్మాణాలలో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరంపేట మొదటి స్థానంలో నిలిచిందని, కానీ నంగునూరు మండలంలో డంప్, గ్రేవ్ యార్డు నిర్మాణాలలో చివరి స్థానంలో ఉన్నామని ఇది అధికారులు, మండల ప్రజాప్రతినిధుల పనితీరుకు నిదర్శనమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీన హరిత హారం కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఉదయం 10 గంటలకు అన్నీ గ్రామాల్లో ఒకేసారి యజ్ఞంలా మొక్కలు నాటేందుకు కావాల్సిన సన్నాహాలు చేపట్టాలని ప్రజాప్రతినిధులకు సచించారు.

Post Top Ad