సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతులని రాజులని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకనుగుణంగానే ప్రభుత్వ పాలన సాగుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డీసీసీబీ ఆధ్వర్యంలో ఆ బ్యాంకు చైర్మన్ మార్నేని రవిందర్ రావు నేతృత్వంలో పలువురు రైతులకు రూ.కోటి విలువైన పంట రుణాల చెక్కులు, హార్వెస్టర్ వాహనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు.