ఐదుగురు కరోనా పేషెంట్లలో ఆశాజనక ఫలితాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 04, 2020

ఐదుగురు కరోనా పేషెంట్లలో ఆశాజనక ఫలితాలు

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న వేళ ఊరటనిచ్చే వార్త ఇది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీ  చికిత్స అందించడానికి ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లోనూ ప్లాస్మా థెరపీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో ఐదుగురు పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేయగా.. మెరుగైన ఫలితం వచ్చిందని ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస రావు తెలిపారు.

ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఐదుగురు పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించామని డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ఒక్కో పేషెంట్‌కు రెండు సెషన్ల చొప్పున ప్లాస్మా థెరపీ చేయగా.. పేషెంట్ల అందరిలో ఆశాజనకమైన పనితీరు కనిపించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం వారికి ఆక్సిజన్ అందించాల్సిన అవసరం లేకుండా పోయిందని.. మరో పేషెంట్‌కు ప్లాస్మా థెరపీ చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.