మరింత సులువుగా కరోనా పరీక్షలు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 23, 2020

మరింత సులువుగా కరోనా పరీక్షలు

కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత సులవుగా నిర్వహించడానికి హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) కొత్త విధానాన్ని కనిపెట్టింది. సీసీఎంబీ కనిపెట్టిన కొత్త విధానంలో శాంపిల్‌ తీసుకున్న వెంటనే నేరుగా ఆర్టీ-పీసీఆర్‌(రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌)యంత్రాల ద్వారా పరీక్ష జరిపి తక్కువ సమయంలో వ్యాధి నిర్ధారణ చేస్తారు. వైరల్‌ ట్రాన్స్‌ఫర్‌ మీడియా (వీటీఎం), ఆర్నే అవసరం లేకుండా డ్రైసిరమ్‌ ద్వారా ఆర్టీ పీసీఆర్‌పై టెస్ట్‌ చేసి కరోనా వైరస్‌ ఉందా లేదా అన్నది నిర్ధారించవచ్చని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. ‘ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలో అనుమానితుల గొంతు, ముక్కు నుంచి స్వాబ్‌ను సేకరించి లిక్విడ్‌ ఉన్న ట్యూబ్‌లో వేస్తారు. వీటీఎమ్‌ ద్వారా ‘ఆర్నే’ అనే ద్రవం తడి ఆరిన తర్వాత ఆర్టీ పీసీఆర్‌పై పరీక్షిస్తారు. మైనస్‌ డిగ్రీలో చల్లగా ఉన్న ద్రావకం నుంచి వైరస్‌ను వేరుచేసి వ్యాధిని నిర్ధారించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నది. దీనివల్ల కొన్ని సందర్భాలలో ట్యూబ్‌లో ఉన్న లిక్విడ్‌ లీకై గాలిలో బుడగలుగా వచ్చే సమస్య కూడా వస్తున్నది. కానీ తాము లిక్విడ్‌ అవసరం లేకుండా వ్యక్తుల నుంచి సేకరించిన స్వాబ్‌ నమూనాలను డ్రై పద్ధతిలో తీసుకునే విధానాన్ని కనిపెట్టాం’ అని మిశ్రా వివరించారు. దీని ద్వారా సమయం, ఖర్చు కూడా బాగా తగ్గుతుందని చెప్పారు. కొత్త విధానంలో రెట్టింపు పరీక్షలు చేయవచ్చని తెలిపారు. తాము చేసిన ప్రయోగాలు విజయవంతం కావడంతో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీమ్‌ఆర్‌) అనుమతి కోసం పంపినట్లు ఆయన వెల్లడించారు.