కొండపోచమ్మ కట్టపై కేసీఆర్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 13, 2020

కొండపోచమ్మ కట్టపై కేసీఆర్‌

సిద్దిపేట జిల్లా మర్కూక్‌లోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్‌ కారులో మర్కూక్‌, పాములపర్తి రోడ్డుమార్గంలో కొండపోచమ్మసాగర్‌ కట్టపైకి చేరుకొన్నారు. రిజర్వాయర్‌లోకి మర్కూ క్‌ పంప్‌హౌజ్‌ నుంచి 2 పంపుల ద్వారా ఎత్తిపోస్తున్న జలాలను కొద్దిసేపు పరిశీలించారు. రిజర్వాయర్‌ కట్టపై  మిగతా కొండపోచమ్మ కట్టపై కేసీఆర్‌కారులో ప్రయాణిస్తూ అక్కడక్కడా కిందకు దిగారు. రిజర్వాయర్‌ను, నీటిమట్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు జహంగీర్‌, ఈఎన్సీ హరిరామ్‌ తదితరులు ఉన్నారు. గత నెల 29న సీఎం కేసీఆర్‌ మర్కూక్‌ పంప్‌హౌజ్‌లో రెండుమోటర్లను ఆన్‌చేసి.. కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతను ప్రారంభించారు. అదేరోజు సీఎం రెండుసార్లు రిజర్వాయర్‌పైకి వచ్చి కట్టపై కలియతిరిగారు. నీటి ఎత్తిపోతను తనివితీరా చూశారు. తాజాగా మరోసారి ప్రత్యేకంగా వచ్చి రిజర్వాయర్‌ను పరిశీలించడంతో రైతులు, స్థానికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రిజర్వాయర్‌లోకి 0.8 టీఎంసీ నీళ్లు చేరినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కాలువలు, పంపుల పనితీరు, రిజర్వాయర్‌లో నీటిని నింపే అంశాలపై ఈఎన్సీ హరిరాంతో చర్చించిన సీఎం పలు సూచనలు చేసినట్టు తెలిసింది.