జాతీయస్థాయిలో మెరిసిన అటవీ కాలేజీ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 19, 2020

జాతీయస్థాయిలో మెరిసిన అటవీ కాలేజీ

రాష్ర్టానికి జాతీయస్థాయిలో మరో గుర్తింపు లభించింది. అటవీ విద్య బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)కు కేంద్ర ప్రభుత్వం ఏ ప్లస్‌ క్యాటగిరీ విద్యా సంస్థగా గుర్తింపు ఇచ్చింది. అటవీ కాళాశాలల్లో ప్రమాణాలు, వసతులను అధ్యయనంచేసిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ) తెలంగాణ కాలేజీని అత్యంత ప్రాధా న్యం గల విద్యాసంస్థగా తేల్చింది. 
అడవులు, పర్యావరణ రక్షణకు  ప్రాధాన్యం ఇస్తూ అటవీవిద్యను ప్రోత్సహించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ అటవీ కళాశాలను ఏర్పాటుచేశారు. నాలుగేండ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో మొదటి బ్యాచ్‌ ఈ ఏడాది పూర్తికానున్నది. ఈ ఏడాది నుంచి రెండేండ్ల ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ, మూడేండ్ల పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సులను కూడా ప్రారంభిస్తున్నారు. ఎంసెట్‌ ఆధారంగా అడ్మిషన్లు చేపడుతున్నారు. బోధనలో ఉన్నత ప్రమాణాల కోసం బ్రిటిష్‌ కొలంబియా, అబర్న్‌ యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఇటీవలే ఓ విద్యార్థినికి అబర్న్‌ వర్సిటీ ఉచితంగా ఎమ్మెస్సీ సీటు ఇచ్చింది

‘ప్రభుత్వ కృషికి దక్కిన ఫలితమిది. అటవీశాఖ అధికారులు, కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులకు నా అభినందనలు, శుభాకాంక్షలు.’
- కే చంద్రశేఖర్‌రావు, ముఖ్యమంత్రి

ఏ ప్లస్‌ రావటం గొప్ప విషయం 

ఎఫ్‌సీఆర్‌ఐకి ఇండియన్‌ ఫారెస్ట్‌ కౌన్సిల్‌ ఏ ప్లస్‌ క్యాటగిరీ ఇవ్వడం హర్షించదగ్గ అంశం. సీఎం కేసీఆర్‌ పట్టుదలతోనే ఇది సాధ్యమైంది. భవిష్యత్‌లో ఎక్కువ మంది ఐఎఫ్‌ఎస్‌లను, అటవీ ఉద్యోగ నిపుణులను తయారుచేస్తాం. ఇంతటి గుర్తింపు రావడానికి కృషిచేసిన కళాశాల డీన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు అభినందనలు.
- అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి

భవిష్యత్‌లో మరింత గుర్తింపు

ఏ ప్లస్‌ గుర్తింపు సాధించడంతో తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీకి భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు మరింతగా వచ్చే అవకాశమున్నది. ప్రభుత్వం, ఇతర సంస్థల సహకారంతో అటవీ కాలేజీ విద్య, పరిశోధనారంగాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది.
- జీ చంద్రశేఖర్‌రెడ్డి, కళాశాల డీన్‌

Post Top Ad