కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు షాక్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 05, 2020

కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు షాక్

కరీంనగర్‌లో బీజేపీ బలపడుతోంది. బండి సంజయ్ తన ఇలాకాలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. తర్వాత రాష్ట్రంలో కీలక నేతలను పార్టీలో చేర్చుకొని.. బీజేపీని తిరుగులేని రాజకీయశక్తిగా నిలిపేందుకు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పట్లో ఎన్నికలు లేవు.. కానీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని చేరికలపై ఇప్పటినుంచే వ్యుహరచన చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలింది. మాజీ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం పార్టీ మారారు. వాస్తవానికి ఆయన గత కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. శుక్రవారం బీజేపీ గూటికి చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ నేత జీ వివేక్ సమక్షంలో పార్టీలో చేరారు. మృత్యుంజయానికి నేతలు సాదర స్వాగతం పలికారు.
మృత్యుంజయం వర్గం మొత్తం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరింది. దీంతో బీజేపీకి కొంత బూస్ట్ ఇచ్చినట్లవుతోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీలో చేరేవారికి తగిన ప్రాధాన్యం ఉంటుందని భరోసానిస్తున్నారు. మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.