పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : ఎస్పీ కోటిరెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 30, 2020

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : ఎస్పీ కోటిరెడ్డి

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇందుకోసం అందరూ మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పోలీస్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు.
డీజీపీ ఆదేశాల మేరకు విస్తృతంగా పోలీస్ కార్యాలయం, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటుతామన్నారు.  ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా  తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్, టౌన్ డీఎస్పీ నరేష్ కుమార్, ఏ.ఆర్ డీఎస్పీ జనార్దన్ రెడ్డి, శశిధర్, ఆర్.ఐలు నరసయ్య, పూర్ణచందర్, సురేష్, లాల్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు.