పీవీ నరసింహారావుకు మంత్రి కేటీఆర్‌ నివాళి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 28, 2020

పీవీ నరసింహారావుకు మంత్రి కేటీఆర్‌ నివాళి

భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్‌ పీవీకి నివాళర్పించారు. ట్విట్టర్‌ ద్వారా మంత్రి స్పందిస్తూ... తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు.. వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. 
పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞాపభూమిలో ప్రధాన కార్యక్రమం జరుగనుంది. ఈ ఉదయం 10.30 గంటలకు పీవీ శత జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు.