రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విజయాలు.. మోదీని ప్రశంసించిన బండి సంజయ్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 20, 2020

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విజయాలు.. మోదీని ప్రశంసించిన బండి సంజయ్..

తెలంగాణ భారతీయ జనతా పార్టీ మరో ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. దేశం మొత్తం బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో ఆ పార్టీకి మరింత ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే లక్ష్యంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. అందుకోసం నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్బాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ బీజేపి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తెలంగాణ బీజేపిని బలోపేతం చేసే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు ఆక్సీజన్ లా పనిచేస్తాయని రాష్ట్ర బీజేపి విశ్వసిస్తున్నట్టు తెలుస్తోంది.అందులో భాగంగా ప్రధానిగా నరేంద్ర మోదీ సంవత్సర కాలంలో అందుకున్న విజయాలను ఏకరువు పెట్టడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో జన్‌ సంవద్‌ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ శ్రణులందరూ కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూనే ర్యాలీలో పాల్గొనాలని సంజయ్ కుమార్ పిలుపునిస్తున్నారు. తెలంగాణ బీజేపి అగ్రనేతలందరూ పాల్గొనే ఈ వర్చువల్‌ ర్యాలీని విజయవంతం చేయాలని సంజయ్ కుమార్ తెలిపారు.అంతే కాకుండా దేశంలో ప్రజల ఆశీర్వాదంతో, అద్వితీయ మెజారిటీతో కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణలోని పార్టీ శ్రేణులకు తెలంగాణ ప్రజలకు జాతీయ నాయకత్వం నివేదిక ఇవ్వనున్నట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వర్చువల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శనివారం సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు జరగనున్న ర్యాలీని తెలంగాణలోని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.