హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వీడియో కాన్ఫరెన్స్... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 16, 2020

హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్ లోని  కుత్బుల్లాపూర్ నియోజకవర్గ  ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వీడియో కాన్ఫరెన్స్...  
>కరోనా నేపథ్యంలో టెక్నాలజీని వినియోగిస్తున ఎమ్మెల్యే కేపి వివేకానంద్.....
>జూమ్ ఆప్ ద్వారా వినతుల స్వీకరణ.. ఆ వెంటనే అధికారులకు ఆదేశాలు.....
శుభ తెలంగాణ న్యూస్ (16జూన్కు20)కుత్బుల్లాపూర్  కరోనా వైరస్, సీజనల్ వ్యాధులు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై రెండవ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్  పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయం నుండి విడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలకు సూచనలు అందించారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఒకరిని ఒకరు కలవలేని పరిస్థితి ఏర్పడటంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే  టెక్నాలజీని వినియోగిస్తూ ZOOM APP ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు డివిజన్ల అధికారులు, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, సంక్షేమ సంఘం సభ్యులు, నాయకులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనగా ఎమ్మెల్యే  ప్రసంగించారు. కరోనా వైరస్ రోజు రోజుకీ అతి వేగంగా వ్యాప్తి చెందుతున్నందుకు ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, వ్యాధిని అరికట్టాలంటే భౌతిక దూరం పాటించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి కావడం వల్లే ఈ వీడియో కాన్ఫరెన్స్ చేపట్టామన్నారు.  పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు మన ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రపరచుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఏర్పడిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతామని అన్నారు.