వినియోగదారులు వాడుకున్న కరెంట్ కే బిల్లులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 07, 2020

వినియోగదారులు వాడుకున్న కరెంట్ కే బిల్లులు

తెలంగాణ కరెంట్ బిల్లులకు సంబంధించిన అంశాలపై (టీఎస్ పీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి స్పందించారు. తమది ప్రభుత్వ రంగ సంస్థని.. ఇందులో ఎలాంటి అవకతవకలకు చోటు ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లులపై అపోహలు వద్దన్నారు. ఎవరికీ ఎక్కువ, తక్కువ బిల్లులు ఇచ్చే ఆస్కారం లేదని, టారిఫ్ ప్రకారమే విద్యుత్ బిల్లులు జారీ చేశామన్నారు. కేవలం వినియోగదారులు వాడుకున్న కరెంట్ కే బిల్లులు వేశామని తెలిపారు.
లాక్ డౌన్ కాలంలో 60 శాతం వినియోగదారులు బిల్స్ సకాలంలో చెల్లించారని పేర్కొన్నారు. అయితే తెలంగాణ కరెంట్ విధానాన్ని మిగతా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని కొనియాడారు. మొత్తం 95 లక్షల 13 వేల వినియోగదారుల్లో 75 శాతం డొమెస్టిక్ వినియోగదారులు ఉన్నారని వెల్లడించారు. 200 కంటే తక్కువ వినియోగించే వారు 86 శాతం ఉన్నారని చెప్పారు.
ఈఆర్ సీ టారీఫ్ ప్రకారం గత మూడు సంవత్సరాల నుంచి ఇదే అమలు చేస్తున్నామని తెలిపారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి టారీఫ్ పెంచలేదన్నారు. ప్రజల వినియోగాన్ని బట్టి 100 యూనిట్ల వరకు ఒక కేటగిరి, వంద నుంచి 200 యూనిట్ల వరకు ఒక కేటగిరి, 200 పైన ఒక కేటగిరి చొప్పును మూడు కేటగిరిలు ఉన్నాయని తెలిపారు. దాంట్లో కూడా వారి స్లాబును బట్టి.. ఈఆర్ సీ టారీఫ్ ప్రకారం రేట్లు ఉంటాయన్నారు. 
లాక్‌డౌన్‌ వల్ల చాలామంది 3 నెలలపాటు ఇళ్లకే పరిమితం కావడంతో విద్యుత్‌ వినియోగం గత ఏడాదితో పోలిస్తే 39 శాతం పెరిగిందన్నారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో సరాసరి 107 యూనిట్లు వాడినవారు ఈ ఏడాది అవే నెలల్లో 146 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారని వెల్లడించారు. తమ సంస్థ పరిధిలో 95.13 లక్షల మంది వినియోగదారుల్లో 70.97 లక్షలు గృహ వినియోగదారులేనని తెలిపారు. వీరిలో 86 శాతం మంది నెలకు 200 యూనిట్లకన్నా తక్కువ వాడేవారున్నారని చెప్పారు. తన ఇంట్లోనే 15 శాతం విద్యుత్‌ వినియోగం పెరిగిందని సోదాహరణంగా వివరించారు. 

Post Top Ad