ఘనంగా మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ జన్మదిన వేడుకలు..... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 17, 2020

ఘనంగా మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ జన్మదిన వేడుకలు.....

శుభ తెలంగాణ(జూన్ 17)మేడ్చల్ జిల్లాకుత్బుల్లాపూర్
సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ లో మరియు SR నాయక్ నగర్ కాలనీలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ జన్మదిన వేడుకలు సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుబ్బల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డిసిసి అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్  covid 19 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదని అభిమానులు కార్యకర్తలు పేద ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో సుభాష్ నగర్ డివిజన్లోని పలు ప్రాంతాలలో ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి 250 పారిశుధ్య కార్మికులకు ఉల్లిపాయలు, కూరగాయలు, మరియు శానిటైజర్లు , మాస్కులు, హ్యాండ్ గ్లౌజ్ లను పారిశుద్ధ్య కార్మికులకు గుబ్బల లక్ష్మీనారాయణ అందజేశారు. అనంతరం గుబ్బల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మా నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పిలుపుమేరకు ఇబ్బంది పడుతున్న  పేద ప్రజలకు  ఎప్పటికప్పుడు సేవ చేస్తూనే ఉంటామని కూన శ్రీశైలం గౌడ్  నాయకత్వంలో భవిష్యత్తులో కూడా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు చాంద్ పాషా, లో చారం కవిత రమణ, బొబ్బ ప్రసాద్, ఫయాజ్, మల్లేష్ గౌడ్, వీరేష్, బిజ్జిలి గోపి, ఏసుబాబు, శీల బోయిన శ్రీనివాస్,గుబ్బల వెంకటరమణ, మాల్యాద్రి హరిబాబు , దాత్రిక శ్రీనివాస్, వల్లూరి ప్రసాద్,  దశరద్, మోహన్ , శేఖర్ తదితరులు పాల్గొన్నారు.