బీజేపీ అధ్యక్షుడు నడ్డాపై మంత్రి హరీశ్‌ ఫైర్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 22, 2020

బీజేపీ అధ్యక్షుడు నడ్డాపై మంత్రి హరీశ్‌ ఫైర్‌

కరోనా కట్టడికి అహర్నిశలు కృషిచేస్తున్న వైద్యసిబ్బంది ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించడం దారుణమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మానవాళి మనుగడకే సవాలుగా మారిన ఈ వైరస్‌ విషయంలో రాజకీయాలుచేయడం.. దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లాడటంతో సమానమని పేర్కొన్నారు. జేపీ నడ్డా వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఆదివారం ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులు, తమ ప్రాణాలు లెక్కచేయకుండా కరోనాపై పోరాడుతున్న వైద్యులు ఒక్కటే అని మనమంతా అనుకుంటున్నాం కదా. ప్రధాని మోదీ కూడా ఇదే చెప్తున్నారు. 
దేశ రక్షణ విషయంలో ప్రభుత్వాలపై విమర్శలుచేస్తే సైనికుల ఆత్మైస్థెర్యం దెబ్బతింటుందని మీరే అంటారు. మరి కరోనా విషయంలో రాష్ర్టాలను విమర్శించడం రాజనీతి అవుతుందా? కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన మీరే వైద్యుల కృషిని తక్కువచేసి చూపడం సబబా? ఇది వైద్యసిబ్బంది ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసే చర్య కాదా?’ అని ప్రశ్నించారు.