బోనాలకు బ్రేక్ భక్తులకు నో ఎంట్రీ: మంత్రి అల్లోల - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 06, 2020

బోనాలకు బ్రేక్ భక్తులకు నో ఎంట్రీ: మంత్రి అల్లోల

కరోనా మహమ్మరి వల్ల స్కూళ్లు, కాలేజీలు క్లోజ్.. ఆలయాలు, ప్రార్థన మందిరాలు సోమవారం నుంచి తెరుచుకుంటోన్న.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే ప్రతీసారి నిర్వహించే బోనాల పండగ ఈ సారి నిర్వహించడం లేదు అని ప్రభుత్వం వెల్లడించింది. అమ్మవార్లకు పూజారులే బోనాలు సమర్పిస్తారని దేవదాయశాఖ మంత్రి అల్లలో ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు పెరగడం ఒక కారణమైతే.. భౌతికదూరం పాటించడం ముఖ్యమని తేల్చిచెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లో బోనాల పండుగ వైభవంగా జరుగుతాయి. గోల్కొండ బోనాల నుంచి మొదలై మహంకాళితో ముగుస్తాయి. బోనాలతో భాగ్యనగరంలో ఉత్సవ శోభ కనిపిస్తూ ఉంటుంది. కానీ కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో బోనాల పండగ నిర్వహించడం లేదని దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 25వ తేదీన గోల్కొండ బోనాలు ప్రారంభం కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కానీ కరోనా వల్ల పూజారులే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు.