సర్కారుపై హైకోర్టు ఆగ్రహం, హెచ్చరిక - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 09, 2020

సర్కారుపై హైకోర్టు ఆగ్రహం, హెచ్చరిక

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కారుపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయడం లేదంటే మండిపడింది.
అంతేగాక, తమ ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను ఇందుకు బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని, విచారణ జరగాల్సి ఉందన్న అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రజల్లో కరోనా ర్యాండమ్ టెస్టులు కూడా చేయడం లేదని, రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా సోకిందని హైకోర్టు మండిపడింది. మీడియా బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని నిలదీసింది. జూన్ 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖను హైకోర్టు ఆదేశించింది.