ఉద్యమంలా హరితహారం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 25, 2020

ఉద్యమంలా హరితహారం

జంగల్‌ బచావో.. జంగల్‌ బడావో అనే సీఎం కేసీఆర్‌ నినాదస్ఫూర్తితో ఆరోవిడుత హరితహారాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రూ.12. 46 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సునితారెడ్డితో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. తొలుత పెద్దేముల్‌ మండలం దుగ్గాపూర్‌ వద్ద 20 హెక్టార్ల అటవీభూమిలో 33,200 మొక్కలునాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోవిడుతలో 30 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యమని మంత్రి తెలిపారు.