గోదావరి నదీ జలాల వినియోగంపై ఫిర్యాదులు.. ఇరు రాష్ట్రాలు ఒకరి వాదనలు ఒకరు పరస్పరం వినాలన్న బోర్డ్ ఛైర్మన్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 06, 2020

గోదావరి నదీ జలాల వినియోగంపై ఫిర్యాదులు.. ఇరు రాష్ట్రాలు ఒకరి వాదనలు ఒకరు పరస్పరం వినాలన్న బోర్డ్ ఛైర్మన్..

రెండు తెలుగు రాష్ట్రాల్లో జలాల జగడం జోరుగా సాగుతోంది. కృష్ణ నదిపై ఎన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో వివరాలు ఇవ్వాలని రెండు తెలుగురాష్ట్రాలకు కృష్ణ నదీజలాల యాజమాన్య బోర్ట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం రోజున గోదావరీ జలాల వాడకం, ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి లభ్యత, వినియోగం తదితర అంశాలపై తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సమావేశమయ్యరు. ఐతే తెలంగాణ అభ్యంతరాలను ఏపి వినాలని, ఏపి ప్రభుత్వ అభ్యంతరాలను తెలంగాణ ప్రతినిధులు వినాలని చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు.
దీంతో గోదావరి జలాల వినియోగంపై టెలిమెట్రీ ఏర్పాటు కోసం బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసిందని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీ జలాల వినియోగంపై పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్ లో సమావేశమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులతో పాటు నిపుణులు హాజరయ్యారు. తెలంగాణ తరుపున రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు.