జర్నలిస్ట్ మనోజ్ కుమార్ యాదవ్ మృతికి శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 13, 2020

జర్నలిస్ట్ మనోజ్ కుమార్ యాదవ్ మృతికి శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు


శుభ తెలంగాణ (13,జూన్ , 2020) : కూకట్ పల్లి భరత్ నగర్ లో  జర్నలిస్ట్ మనోజ్ కుమార్ యాదవ్ మృతికి శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ పార్టీ టి పి సి సి అధికార ప్రతినిధి పి, నాగిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,కూకట్పల్లి మీడియా మిత్రుల సమక్షంలో భౌతిక దూరం పాటిస్తూ కొవ్వొత్తుల తో నివాళులు అర్పించి వారి కుటుంబానికి సంఘీభావం తెలియచేసారు ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ. కరోన మహమ్మారి తో విధి నిర్వహణలో జర్నలిస్ట్ మనోజ్ చనిపోవడం బాధాకరం ఆని ,ఇన్నిరోజులుగా కోట్లలో ఖర్చులు చూపిస్తూ కరోనా బాధితులకు మెరుగైన  వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకున్న  తెలంగాణ ప్రభుత్వం మనోజ్ కి అందించిన వైద్యం కళ్ళకు కట్టినట్లుగా వీడియోలో చూపించటంతో గుట్టు రట్టయిందని, మనోజ్  కుటుంబానికి ఆర్థిక సహాయం తో పాటు ఒకరికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఇకనైనా కేంద్రం,కోర్టులు సూచించినట్టుగా ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చి కరోన పరీక్షలు నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. మనోజ్ యాక్ట్ తేవాలని తక్షణమే మనోజ్ కుటుంబ ఆదుకోవాలని కూకట్పల్లి జర్నలిస్టులు ప్రభుత్వని డిమాండ్ చేశారు ఇక నైన ప్రభుత్వం మేలుకోని తగు చర్యలు తీసుకోవాలని  విలేకరులు  యాకయ్య,సురేష్ యాదవ్,దనుంజయ చారి, బొమ్మ శ్రీధర్ యాదవ్,భాస్కర్ చారి, శంకర్ యాదవ్,సల్ల సంతోష్ యాదవ్, రమేష్ యాదవ్,షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు