పీఏకు కరోనా పాజిటివ్.. హోం క్వారంటైన్‌లో మంత్రి హరీశ్ రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 13, 2020

పీఏకు కరోనా పాజిటివ్.. హోం క్వారంటైన్‌లో మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి హోం క్వారంటైన్లోకి వెళ్లారు. మంత్రి పీఏకు కరోనా సోకడంతో... ఆయనతో కాంటాక్ట్ అయిన 51 మంది శాంపిళ్లన సేకరించారు. వీరిలో 17 మందికి నెగటివ్ అని నిర్ధారణ అయ్యింది. మిగతా వారి రిపోర్టులు నేడు (శనివారం) వచ్చే అవకాశం ఉంది. పీఏను కలిసి ఇప్పటికే ఐదు రోజులు కావడంతో తాను వారం రోజులపాటు క్వారంటైన్లో ఉంటానని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులు చక్కబెడతానని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఇప్పటికే సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. యాదాద్రి జిల్లా కలెక్టర్ కూడా హోం క్వారంటైన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా సోకడంతో శుక్రవారం మేయర్ కూడా కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. అంతకు ముందు కూడా ఓసారి మేయర్ కరోనా టెస్టులు చేయించుకోగా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది.

  • ఇంతకు ముందు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడగా... చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఓ రాజకీయ నాయకుడికి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు సమాచారం. దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా.. కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చినట్లు తెలుస్తోంది.