అత్యుత్తమ క్రీడా పాలసీ కోసం కృషి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 24, 2020

అత్యుత్తమ క్రీడా పాలసీ కోసం కృషి

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు క్రీడలు నేర్పించేలా నూతన క్రీడాపాలసీని రూపొందిస్తున్నట్టు క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. పిల్లలకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని, ఆ దిశగా అత్యుత్తమ క్రీడావిధానం కోసం కృషిచేస్తున్నామని తెలిపారు. ఒలింపిక్‌ డేను పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఒలింపిక్స్‌ క్రీడల పట్టికలో తెలంగాణ క్రీడాకారులు ముందుండేలా క్రీడాసంఘాలు, సీనియర్‌ క్రీడాజర్నలిస్ట్టులు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. అన్ని స్థాయిల క్రీడాకారులకు చేయూతనిచ్చేలా నూతన క్రీడాపాలసీ ఉండటం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కే రంగారావు, ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.