మల్కాజిగిరి ప్రాంతంలో పోల్కం అవినాష్‌ టీమ్‌ ఆధ్వర్యంలో కరోనా క్రిమిసంహారకాల పిచికారి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 28, 2020

మల్కాజిగిరి ప్రాంతంలో పోల్కం అవినాష్‌ టీమ్‌ ఆధ్వర్యంలో కరోనా క్రిమిసంహారకాల పిచికారి


శుభ తెలంగాణ న్యూస్‌ (28,జూన్‌,2020) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు భారీ పెరుగుతున్న నేపద్యంలో , మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి ప్రాంతంలో టీమ్‌ పోల్కం అవినాష్‌ ఆధ్వర్యంలో కరోనా క్రిమిసంహారకాలను  పిచికారి చేశారు ఇందులో భాగంగా, నివాస ప్రాంతాలు, దేవాలయాలు, మసీదు, పోలీస్‌ స్టేషన్‌, వృద్దాప్య గృహం  మరియు ఇతర బహిరంగ ప్రదేశాలను పిచికారి తో శుభ్రపరిచారు. అనంతరం పోల్కం అవినాష్‌ మాట్లాడుతూ...  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా ని ఎదుర్కోవడం లో విఫలమయ్యారని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారి  ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అలాగే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని మాస్కు ధరించాలి అని చేతులు,  ముఖం, కాళ్లు, శుభంగా ఉంచుకోవాలని ఇది మనందరి బాధ్యత అని, ఈ సందర్భంగా అవినాష్‌ విజ్ఞప్తి చేశారు.