కేసీఆర్‌కు ఎమ్మెల్యే లేఖ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 06, 2020

కేసీఆర్‌కు ఎమ్మెల్యే లేఖ

గాంధీ హాస్పిటల్‌లో కరోనా చికిత్స పొందుతున్న బాధితులకు సేవ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. గాంధీ ఆస్పత్రిలో తాను రోజుకు 10 నుంచి 12 గంటల వరకూ రోగులకు సేవ చేయగలనని లేఖలో చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేసీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ ధూల్‌పేటకు చెందిన ఓ గర్భిణీ గాంధీ ఆస్పత్రిలో చనిపోయిందని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. గాంధీ హాస్పిటల్ డాక్టర్లు సరిగ్గా పనిచేయడం లేనందునే ధూల్‌పేట గర్భిణీ చనిపోయిందని విమర్శించారు.