శుభ తెలంగాణ న్యూస్ (23జూన్20) వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల వైస్ ఎంపీపీ, మదన్ పల్లి గ్రామానికి చెందిన కొండి రాంరెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో, TRS పార్టీ మండల ప్రెసిడెంట్ కమాల్ రెడ్డి, రాంరెడ్డి ల ఆధ్వర్యంలో తెరాస పార్టీలో చేరారు. వీరితో పాటు మదనపల్లి గ్రామానికి చెందిన B. రాంరెడ్డి, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజు, రాములు, మధు, కృష్ణ, నర్సింలు, మల్లయ్య, సుభాష్, శ్యామల్ రెడ్డి, అశోక్, నర్సింలు, కృష్ణ, పోచయ్య, శ్రీనివాస్, యాదయ్య, శేఖర్, రాములు, నర్సింహ రెడ్డి తదితరులు తెరాస పార్టీ లో చేరారు.తెలంగాణ ప్రభుత్వం పై గౌరవ KCR పై ఉన్న నమ్మకం, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధిని చూసాకే పార్టీలో చేరుతున్నాం అని అన్నారు.కార్యక్రమంలో వికారాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ మంజులరమేశ్ , PACS చైర్మన్ ముత్యం రెడ్డి , PACS వైస్ చైర్మన్ పాండు , టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి , TRS పార్టీ మండల జనరల్ సెక్రెటరీ సత్తయ్య , విజయ్ కుమార్, అనంత్ రెడ్డి,నవీన్ కుమార్, గోపాల్, వెంకటయ్య , వేణు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Post Top Ad
Tuesday, June 23, 2020
తెరాస పార్టీ లో చేరిన వికారాబాద్ మండల వైస్ ఎంపీపీ, మదనపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు
Tags
# తెలంగాణ

About Subha Telangana
తెలంగాణ
Tags
తెలంగాణ
Admin Details
Subha Telangana News