తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు పాకిన కరోనా.. అప్రమత్తమైన అధికారులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 20, 2020

తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు పాకిన కరోనా.. అప్రమత్తమైన అధికారులు..

రెండు తెలుగు రాష్ట్రాల పైన కరోనా కరాళ నృత్యం కొనసాగిస్తూనే ఉంది ముఖ్యంగా తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారలు ఒకరి తర్వాత ఒకరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ సచివాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరోసారి కరోనా విరుచుకు పడింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు వైరస్ బారిన పడటంతో సంబంధిత శాఖల కార్యాలయాలకు తాత్కాలిక సెలవులు ప్రకటించారు. మిగతా శాఖల్లోనూ తక్కువ మంది ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. ఇంతటితో ఆగకుండా కరోనా వైరస్ పోలీసు శాఖను కూడా విడిచిపెట్టడం లేదు.
అంతే కాకుండా ఇటీవలే ఆర్థిక శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ శాఖలోని ఉద్యోగులెవరూ కార్యాలయానికి రావడానికి ఝంకుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఉద్యోగులు సైతం అత్యవసరమైతేనే కార్యాలయానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బీఆర్కే భవన్ ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్కానర్ కెమెరాలతో పరీక్షించాకే సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది తరచూ రసాయనాలను జల్లుతున్నారు.
దీంతో మొత్తం బీఆర్కే భవన్‌లో ఇప్పటికి ఆరు కేసులు నమోదవ్వడమే కాకుండా ఈ నెమ్మదిగా పోలీసు శాఖకు పాకింది. ఇదిలా ఉండగా తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. పలువురు ఐపీఎస్ అధికారులకు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఇందులో ఓ మహిళ ఐపీఎస్ అధికారికి కూడా కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అతడిని ఇప్పటికే హౌం క్వారంటైన్‌కు పంపించారు. అతనితోపాటు అడిషనల్ డీజీ స్థాయి అధికారి సహాయకుడికి పాజిటివ్ రావడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఉలిక్కి పడుతున్నారు.