హైదరాబాదీలకు ట్రాఫిక్ పోలీసుల రిక్వెస్ట్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 05, 2020

హైదరాబాదీలకు ట్రాఫిక్ పోలీసుల రిక్వెస్ట్..

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..? టూవీలర్ మీద ఆఫీసుకు, బయట పనులకు వెళ్తుంటారా? అయితే జాగ్రత్త.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకొని, బండికి సంబంధించిన పత్రాల్ని తీసుకెళ్తే సరిపోదు. టూవీలర్‌కు సైడ్ మిర్రర్‌లు ఉండటం తప్పనిసరి. అంతే కాదు బైక్ వెనుక సీట్లో కూర్చున్న పిలియన్ రైడర్‌కు కూడా హెల్మెట్ ఉండాల్సిందే. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు గత కొన్నాళ్లుగా ఈ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. లేదంటే జరిమానాలు విధిస్తున్నారు.

సైడ్ మిర్రర్స్ ఉంటే మలుపు తిరిగేటప్పుడు, ఏదైనా వాహనాన్ని క్రాస్ చేసేటప్పుడు వెనుక నుంచి ఏవైనా వాహనాలు వస్తున్నాయేమో చూసుకోవడం ఈజీ అవుతుంది. అంతేకాదు వెనుక నుంచి ఏదైనా భారీ వాహనం వచ్చినా గుర్తించి అప్రమత్తం కావచ్చు. అంతేకాదు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం బైక్ వెనుక సీటు మీద కూర్చున్న వారు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. నాలుగేళ్ల వయసు దాటిన పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది.

రెండు రోజుల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మహిళలు మరణించారు. బైక్ వెనుక సీటు మీద కూర్చున్న వారికి హెల్మెట్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. టూవీలర్లకు సైడ్ మిర్రర్ ఉన్నా వెనుక నుంచి వచ్చే భారీ వాహనాలను సకాలంలో గుర్తించి అప్రమత్తయ్యే అవకాశం ఉంది.