తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 16, 2020

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా..

లాక్ డౌన్ సడలింపుల తర్వాత కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు పాటించని కారణంగా ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కరోనా మహమ్మారి కాటుకు గురవుతున్నారు. ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు వైరస్ సోకగా.. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు హైదరాబాద్ లో జరిగిన ఓ భేటీలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినట్లు తెలుస్తోంది. సదరు భేటీలో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గోవర్దన్ కలిసినట్లు సమాచారం. ఆ సమావేశంలో మరో ఎమ్మెల్యే సైతం ఈ ఇద్దరితో చనువుగా తిరిగినా ఆయన ఎవరనేది వెల్లడికాలేదు. సదరు భేటీ తర్వాత కొద్ది రోజులకే ముత్తిరెడ్డి అస్వస్థతకు గురికావడం, కరోనా పాజిటివ్ గా తేలడం, రెండ్రోజుల వ్యవధిలోనే బాజిరెడ్డికి సైతం వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం జరిగింది. ఇప్పుడు గణేశ్ గుప్తాకు కూడా గోవర్దన్ తో కాంటాక్ట్ వల్లే వైరస్ సోకినట్లు వినికిడి.