తెలంగాణలో రేపు బ్లాక్ డే, శ్రేణులకు బీజేపీ హై కమాండ్ పిలుపు, ఎందుకంటే... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 24, 2020

తెలంగాణలో రేపు బ్లాక్ డే, శ్రేణులకు బీజేపీ హై కమాండ్ పిలుపు, ఎందుకంటే...

తెలంగాణ వ్యాప్తంగా గురువారం బ్లాక్ డే పాటించాలని బీజేపీ పిలుపునిచ్చింది. బ్లాక్ డే పాటించాలని తమ క్యాడర్‌‌ను కోరింది. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా బ్లాక్ డేకు పిలుపునిచ్చామని పేర్కొన్నది. తమ హయాంలో జరుగుతోన్న పనులు, అభివృద్ది గురించి ప్రజలకు వివరించే అవకాశం ఉంది. కరోనా వైరస్ వల్ల ఎక్కడి నేతలు అక్కడే బ్లాక్ డే పాటించనున్నారు.
1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇదీ దేశ చరిత్రిలో మాయని మచ్చగా నిలిచిపోయింది. అందుకు నిరసనగా 25వ తేదీన బ్లాక్ డే పాటించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ నాడు దేశం చీకటిలో మగ్గిపోయిందని.. ప్రజాస్వామ్యం హరించుకుపోయిందని గుర్తుచేస్తున్నారు.ప్రధాని మోడీ చీమ్మచీకట్లను తొలగించి కాంతి వెలుగులతో దేశాన్ని ప్రజ్వలింపజేస్తున్నారని పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.