పదో తరగతి పరీక్షలు వాయిదా - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 07, 2020

పదో తరగతి పరీక్షలు వాయిదా

హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పును అనుసరించి పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై త్వరలో సీఎం కేసీఆర్‌తో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. కాగా, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలంటూ ఇప్పటికే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
ఇది ఇలావుండగా, శనివారం కూడా తెలంగాణలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 206 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసులతో పోలిస్తే ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ ఒక్క రోజే 10 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 123కు చేరింది.

Post Top Ad