డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్థంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 24, 2020

డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్థంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం


శుభ తెలంగాణ (24, జూన్ 2020) :: కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలో హైదర్ నగర్ డివిజన్,నిజాం పెట్ రోడ్ లో  "బలిదాన్ దివాన్" డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ  గారి వర్థంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం అసెంబ్లీ కో కన్వీనర్ ch. వీరయ్య ఆధ్వర్యంలో చేపట్టారు... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు,మేడ్చల్ జిల్లా అధ్యక్షులు  మాధవరం కాంతారావు  కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులు  అర్పించారు....

 ఈ సందర్బంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ,శ్యామ్ ప్రసాద్ గారు ఆర్టికల్ 370,35A కి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని...

కశ్మీర్ కి వెళ్ళడానికి పర్మిషన్ పాస్ లు పెట్టొద్దని,
రెండు జెండాలు,రెండు ప్రదానిలు, 
రెండు రాజ్యాంగాలు ఉండొద్దని కొట్లాడిన వ్యక్తి అని,
కాశ్మీర్ కి  వెళ్లి అక్కడ న్యాయపోరాటం చేసి అరెస్టులకు  బయకుండా త్యాగాలు చేసిన గొప్ప నాయకుడని తెలిపారు.కార్యక్రమంలో  ఎంపీ అరవింద్ ,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు,అసెంబ్లీ కో కన్వీనర్ ch వీరయ్య,వెలగ శ్రీనివాస్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.