తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్బంగా గులాబీ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, సీఎం చంద్రశేఖర్ రావు పరిపాలనపై మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తూనే ఉన్నడని, కాదంటే యాదాద్రి నర్సింహాస్వామి కొండమీదకు వచ్చి చంద్రశేఖర్ రావు ప్రామాణం చేయగలడా అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమాయకులపై కేసులు నమోదయ్యాయని, ఆ కేసులు మాఫీ చేయకపోగా చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యుల మీద ఉన్న రైల్వే కేసులను మాత్రం ప్రత్యేక అధికారిని నియమించుకుని మరీ మాఫీ చేయించుకున్నారని ఘాటుగా విమర్శించారు రేవంత్ రెడ్డి.
అంతే కాకుండా 12వందల మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో అమరవీరులకు సంబంధించిన చిరుణామాలు తెలియదని చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చెప్పడం దారుణాతి దారుణమని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రశేఖర్ రావు చెప్పే మాటలకు, చేసే పనులకు ఎంతో వ్యత్యాసం ఉందని రేవంత్ ఆరోపించారు. ప్రజలు చంద్రశేఖర్ రావు మాటల విధానాన్ని, చేతలలోని నిలకడలేని తననాన్ని సునిశితంగా పరిశీలించాలని స్పష్టం చేసారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 3లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, ధనిక రాష్ట్రం అంటే ఇదేనా అని రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు.