తెలంగాణలో కరోనా చికిత్స ధరలు ఇలా.... మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి....... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 15, 2020

తెలంగాణలో కరోనా చికిత్స ధరలు ఇలా.... మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి.......

శుభ తెలంగాణ న్యూస్ (15జూన్20)హైదరాబాద్ ‌ : తెలంగాణలో కరోనాపై ఉన్నతస్థాయిలో నిత్యం సమీక్ష చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల వల్లే కేసులు ఎక్కువగా రావడం లేదని వివరించారు. కోఠి కమాండ్‌ సెంటర్‌లో ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో వాటి ధరల వివరాలను మంత్రి ప్రకటించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర : రూ.2,200. వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూలో ఉంచితే రూ.7,500 వెంటిలేటర్‌పై ఉంటే రోజుకు రూ.9 వేలు.లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు..‘కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్‌ చెప్పింది. మనం తీసుకునే చర్యలు బాగున్నాయని కూడా కితాబిచ్చింది. ఐసీఎంఆర్‌ నిబంధనలు పూర్తిగా పాటిస్తున్నాం. కరోనా లక్షణాలు లేని వాళ్లకు పరీక్షలు చేయరు. లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని మార్గదర్శకాలు ఇస్తున్నాం. కరోనా లక్షణాలు లేని వాళ్లు తప్పకుండా హోం ఐసోలేషన్‌ పాటించాలి’ అని మంత్రి కోరారు.