సూర్యాపేటలో ఓ ప్రాంతానికి సంతోష్ బాబు పేరు.. మంత్రి వెల్లడి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 18, 2020

సూర్యాపేటలో ఓ ప్రాంతానికి సంతోష్ బాబు పేరు.. మంత్రి వెల్లడి

సరిహద్దుల్లో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు సూర్యాపేట వద్ద గల కేసారంలో ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు పర్యవేక్షించారు. సంతోష్ బాబుకు అశ్రునయనాలతో అందరూ కడసారి వీడ్కోలు పలికారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి అక్కడే ఉన్న విలేకరులతో మాట్లాడారు. అమర జవాను కల్నల్ సంతోష్ బాబు జ్ఞాపకానికి చిహ్నంగా కేసారం ప్రాంతాన్ని మార్చుతామని తెలిపారు. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన జంక్షన్‌కు సంతోష్ బాబు పేరు పెడతామని ప్రకటించారు. కల్నల్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు తన తరపున సందేశం పంపారని మంత్రి తెలిపారు. సంతోష్ బాబు పిల్లలు, వారి చదువులకు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి కర్నల్ భౌతికకాయం తరలింపు మొదలుకొని అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.