సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 03, 2020

సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ

కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ కొనసాగడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆరు నెలల కిరాయి ప్రభుత్వమే చెల్లించాలని, వారి ఈఎంఐ కూడా కట్టాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ రాశారు. తన లేఖపై ఈ నెల 8వ తేదీలోపు సీఎం నుంచి స్పందన వస్తుందని.. లేదంటే 9వ తేదీన దీక్ష చేస్తానని తెలిపారు.
ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయని.. కావాలని లేవు చెబుతున్నాయని పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్లు ఎలా కేటాయించారు అని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు నగదు కేటాయిస్తారు.. కానీ ప్రజల ప్రయోజనాలు పట్టవా అని నిలదీశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 2 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్.. ప్రజల కోసం మరో లక్ష కోట్లు ఎందుకు అప్పు చేయడం లేదన్నారు. అప్పు చేయకున్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు సాయం చేయమని అడగడం లేదని కొశ్చన్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని.. అందుకే మోడీపై కేసీఆర్ నోరు మెదపడం లేదు అని జగ్గారెడ్డి ఆరోపించారు.