తెలంగాణకు రావాల్సిన కరోనా టెస్ట్ మెషీన్‌... ఆ రాష్ట్రానికి తరలించుకుపోయిన బీజేపీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 24, 2020

తెలంగాణకు రావాల్సిన కరోనా టెస్ట్ మెషీన్‌... ఆ రాష్ట్రానికి తరలించుకుపోయిన బీజేపీ...

కరోనా వైరస్ నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం,బీజేపీ పరస్పర ఆరోపణలు,విమర్శలు చేసుకుంటున్నాయి. వైరస్ నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ సోమవారం ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయగా...ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. తాజాగా సంజయ్ ఆరోపణలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తిప్పికొట్టారు.
గుజరాత్‌లో మీటింగ్ పెట్టింది మీరే... పీపీఈ కిట్లు ఇవ్వంది మీరే,వెంటిలేటర్లు సప్లై చేయనిది మీరే..' అని జీవన్ రెడ్డి ఆరోపించారు. కరోనా నియంత్రణ కోసం కేంద్రం చేసిందేమీ లేదన్నారు. రూ.20లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించారు గానీ.. 30 కోట్ల మంది వలస కార్మికులు కాలినడకన స్వస్థలాలకు వెళ్తుంటే ఏం చేశారని ప్రశ్నించారు. అసలు దేశంలో మర్కజ్ గురించి మొదట కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరే అని చెప్పారు. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్‌కు... అక్కడి ఇండోనేషియన్లు వచ్చిన విషయమే తెలియదన్నారు. కేంద్రానికి కంటైన్‌మెంట్ జోన్ల గురించి సూచించింది కూడా కేసీఆరే అని చెప్పారు. అప్పటివరకూ కేంద్రానికి ఆ సంగతే తెలియదన్నారు.
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో రైతులు,వలస కార్మికులకు ఇచ్చిందేంటని ప్రశ్నించారు. 30 కోట్ల మంది వలస కార్మికుల ఉసురు తీసుకున్నారని విమర్శించారు.కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి సంక్షోభ సమయంలోనూ రూ.5వేల పైచిలుకు కోట్లతో రైతు బంధు సాయం అందిస్తున్నారని చెప్పారు. కల్నల్ సంతోష్ బాబు సరిహద్దులో వీర మరణం పొందితే... ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సాయంపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయన్నారు. ఆఖరికి కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ సైతం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలంటూ పేర్కొన్నారు. 1960 నుంచి 2020 వరకూ ఎంతో మంది సైనికులు అమరులయ్యారని... కానీ కేసీఆర్ అందించిన స్థాయిలో ఎవరూ సాయం అందించలేదని చెప్పారు. అలాంటి వ్యక్తిపై బీజేపీ విమర్శలు చేయడం సరికాదన్నారు.